‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం 1100కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
కలెక్షన్లలో ఖాన్, కపూర్‌లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. చిత్రం విడుదలై 20రోజులు దాటినా కలెక్షన్లలో మాత్రం జోరు తగ్గడం లేదు. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో మరో రికార్డు సాధించింది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో 400కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ‘బాహుబలి-2’ తర్వాత 400కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన సినిమాగా కేజీఎఫ్ రికార్డు సృష్టించింది. కేవలం 23రోజుల్లోనే బాలీవుడ్‌లో ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిందంటే విశేషం అనే చెప్పాలి.
కేజీఎఫ్ దెబ్బకు బాలీవుడ్‌లో ఇటీవలే విడుదలైన స్టార్ హీరోల సినిమాలు పోటీని తట్టుకోలేక డిజాస్టర్లుగా నిలిచాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో నటించాడు. రావురమేష్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.