ఏపీలో సంచలనం సృష్టించిన మూడు రాజధానుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు, ఇతరులు ఒకే రాజధాని కావాలని అది కూడా అమరావతే కావాలంటూ.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత అమరావతి ఒక్కటే రాజధాని అంటూ హైకోర్టు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలమూరు ఎడారిగా మారిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఇక్కడ ఎంపీగా ఉన్న పాలమూరుకు చేసింది శూన్యమన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్ మాటలు మాటలుగానే ఉండిపోయాయన్నారు. పాలమూరు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారి కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రేపు జేపీ నడ్డా వస్తున్నారని,…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సీటీని సందర్శించేందుకు ఓయూ వీసీని అనుమతులు కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో ఎన్‌ఎస్‌యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్టు నిర్ణయాన్ని.. ఓయూ వీసీకే వదిలేసింది. అయితే.. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హై కోర్టు. అయితే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ…
హైదరాబాద్ వ్యాప్తంగా.. బుధవారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామంతపూర్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో.. వరదనీటి కారణంగా రామ్ శంకర్ నగర్ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు కురిసిన చిన్నపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుటికైన నాయకులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ పరిస్థితి గమనించి…
ఈ రోజు తెల్లవారుజామున ఒక్క సారిగా కురిసిన భారీ వర్షం, గాలుల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సీజీమ్, సూపరింటిండెంట్ ఇంజినీర్లతో సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్ల మూలాన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని ఆయన అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రఘుమా…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం వేకువజామున్న ఒక్కసారిగా ఈదురు గాలులతో కుండపోత వర్షం కురియడంతో చెట్లు నేలకొరిగాయి. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం నీటి మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి క్షేత్రంలో కూడా భారీ వర్షం కారణంగా ఆలయ క్యూలైనల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్మించిన నూతన ఘాట్ రోడ్ భారీ వర్షానికి కోతకు గురైంది.…
ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. ఒక్క రాత్రిలో నీటిపాలైంది. వరుణుడి ధాటికి రైతన్న లబోదిబోమంటున్నాడు. బుధవారం వేకువజామున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసింది. భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో వరిధాన్యం కుప్పలు తడిసి ముద్దాయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో సరిపడ టార్ల్పిన్ కవర్లు లేకపోవడంతో వర్షపు నీటిలో వరి ధాన్యం కొట్టుకోయింది. దీంతో రైతన్నలు కన్నీరు కార్చుతున్నారు. మొన్నటి వరకు ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత రాక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలు.. ఇప్పుడు వర్షా ధాటికి ఎంతో…
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో జంట మృతదేహాలు కలకలం సృష్టించాయి. అయితే.. రెండు మృతదేహాలు వారసిగూడ చెందిన యువకుడు యశ్వంత్ మహిళ జ్యోతి గా పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్‌గా యశ్వంత్ పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం ఫోన్ కాల్ రావడంతో యశ్వంత్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. మృతిచెందిన జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో 3 ప్రత్యేక బృందాలను పోలీసులు…
రోజురోజుకు ఇంధన ధరలు పెరగిపోతుండడంతో వాహనాదారులపై పెనుభారం పడుతోంది. అయితే పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే.. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు తగ్గడంతో…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్-1 ఉద్యోగల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలసిందే. అయితే తాజాగా.. గ్రూప్-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. గ్రూప్-1 రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.inని సందర్శించి, సూచించిన ప్రొఫార్మాలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా దరఖాస్తు ఫారమ్‌లో భాగంగా ఓటీఆర్ (OTR) నుండి డేటా తీసుకోబడుతుంది కాబట్టి, ఇంకా తమ ఓటీఆర్‌ను…