వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రు. 2.15 కోట్ల విలువ చేసే సిటీ స్కాన్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. అనంతరం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సిటీ స్కాన్ ప్రారంభించారు. దీంతో పాటు సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో సర్జికల్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటి మెటర్నిటీ హాస్పిటల్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించానని, కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఓల్డ్ బిల్డింగ్ కులిపోతోందని, డాక్టర్ పోస్ట్ లు కావాలన్నారన్నారు. 35 కోట్లతో 110 బెడ్స్, 8 ఆపరేషన్ థియేటర్స్ తో బిల్డింగ్ కడుతున్నామని ఆయన వెల్లడించారు.
డైనేజి సిస్టం కోసం మరో 10 కోట్లు పెంచి.. 35 కోట్ల నిధులు కేటాయించామన్నారు. సుల్తాన్ బజార్ కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో రోగుల తాకిడి పెరిగిందని, కానీ ఇక్కడ యూనిట్స్ తక్కువ ఉన్నాయని, పెట్లబురుజు, నీలోఫర్ నుంచి కొన్ని యూనిట్స్‌ను ఇక్కడకు తెప్పిస్తామన్నారు. శానిటేషన్ కు ప్రతి నెలకు ఒక బెడ్ మీద 5 వెలు ఇచ్చేవాళ్ళము.. ఇప్పుడు 7500 కి పెంచామని ఆయన తెలిపారు. 200 కోట్లు శానిటేషన్ కు ఖర్చు చేస్తున్నామని, పారిశధ్యం మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నామన్నారు. అంతేకాకుండా జంట నగరాల్లో 18 హాస్పిటల్స్ లలో ఈ నెల 12న ఉచితంగా భోజనం కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, 5 రూపాయిల మీల్స్ .. మూడు పూటలా అందజేయనున్నామని ఆయన పేర్కొన్నారు. నిజాం కాలంలో పెట్టిన హాస్పిటల్స్ తో వైద్యం అందిస్తున్నామని, ఇప్పుడు కేసీఆర్ హయాంలో కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయన్నారు. కేసీఆర్ కిట్‌తో 30 నుంచి 56శాతానికి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవాలు పెరిగాయని ఆయన వెల్లడించారు.