బహుదూర్‌పుర లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 225 గ్రాముల బ్రౌన్ షుగర్, 28 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. నలుగురుని అరెస్ట్ చేశామని, ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు షాహ్జదా సయ్యద్ గతంలో ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని, ఈ కేసులో వైజాగ్ నుంచి గంజాయి హైదరాబాద్ కి తరలిస్తున్న మరో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశామన్నారు. ట్రిప్ కి 5 వేలు తీసుకొని వైజాగ్ నుంచి హైదరాబాద్ కి గంజాయి తీసుకొస్తున్నారని, ముంబై నుంచి బ్రౌన్ షుగర్ హైదరాబాద్ కి ఖాద్రి తీసుకొస్తున్నాడని, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయన్నారు.
సౌత్ ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ ని ఎంచుకుని ఆఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారన్నారు. త్యాన్ జినియ, జమైకా, జాన్సన్ బర్గ్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి ఎక్కువగా డ్రగ్స్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ట్రాన్సిట్ పాయింట్ గా మారిందని, 125 కోట్ల విలువైన డ్రగ్స్ ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డాయన్న సీపీ.. డ్రగ్స్ తీసుకొచ్చేవారికి ఇక్కడ రిసీవర్స్ ఎవరో తెలియదని, ఇక్కడికి వచ్చిన డ్రగ్స్ ముంబై, ఢిల్లీ తరలిస్తున్నారన్నారు. సెంట్రల్ ఏజెన్సీస్, NCB, DRI, ED, Customs, CI cell, CISF అన్ని కలిసి పని చేస్తే ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ ని నిర్మూలించవచ్చని, దేశంలో 8 నుంచి 10 కోట్ల డ్రగ్ అనలిస్ట్ లు ఉన్నారని NCB అంచనా నివేదిక ఇచ్చిందన్నారు. గత పదేళ్ళలో దేశంలో 70 శాతం డ్రగ్స్ వాడకం పెరిగినట్లు NCB చెబుతుందని, నేషనల్ ఎజేన్సీ ద్వారా డ్రగ్స్ కు చెక్ పెడుతున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో సమావేశం అవుతామని, అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని సీపీ ఆనంద్ వెల్లడించారు.