Vishwak Sen : విశ్వక్ సేన్ కు కలిసి రాని వాలెంటైన్స్ డే.. ఏమైందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ప్రతిసారి హిట్ కొత్తతాడు అనే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే, గడిచిన రెండేళ్లుగా వాలెంటైన్స్ డే సీజన్ మాత్రం అతనికి అస్సలు కలిసి రావడం లేదు. 2025లో ‘లైలా’తో ఎదురైన చేదు అనుభవం, 2026లో ‘ఫంకీ’తోనూ సేమ్ రిజల్ట్ అందుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్
Also Read
గతేడాది ఫిబ్రవరి 14న విడుదలైన ‘లైలా‘ చిత్రంపై విశ్వక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆయన లేడీ గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విభిన్నమైన ప్రమోషన్స్, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కథలో బలం లేకపోవడం మరియు కొన్ని వివాదాల కారణంగా ‘లైలా’ విశ్వక్ కెరీర్‌లో ఒక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ‘లైలా’ పరాజయం తర్వాత, ఈ ఏడాది వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన ‘ఫంకీ’ చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశించారు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండేది. కానీ, ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మిశ్రమ స్పందన రావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా వాలెంటైన్స్ డే సెంటిమెంట్ విశ్వక్ సేన్ కు కలిసి రాలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?