What’s Today:
* తెలంగాణలో 8వ రోజుకు చేరిన భారత్ జోడో యాత్ర.. నేడు బాలానగర్ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ పాదయాత్ర.. హబీబ్ నగర్, ముసాపేట్, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా సాగనున్న యాత్ర
* బాపట్ల జిల్లా: నేడు కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
* నేడు నెల్లూరు జెడ్పీ సమావేశం.. హాజరుకానున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
* ఢిల్లీ: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
* చెన్నైలో నేడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటన.. సాయంత్రం సీఎం స్టాలిన్‌తో సమావేశం కానున్న మమత
* ఢిల్లీ: కులాల వారీగా బీసీ గణన చేపట్టాలని ఆర్.కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారించనున్న సుప్రీంకోర్టు
* టీ20 ప్రపంచకప్: నేడు జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్ (ఉ.9:30 గంటలకు), భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (మధ్యాహ్నం 1:30 గంటలకు)