1) ఫేక్ కాల్స్ & మెసేజ్‌లను చెక్.. ట్రాయ్ కొత్త ప్రణాళిక కొంతకాలం నుంచి సైబర్ నేరాలు ఎలా పెరిగిపోయాయో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆఫర్లు, బహుమతులు వచ్చాయంటూ.. ఫేక్ కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు టోకరా వేసి, సున్నితంగా దోచేసుకుంటున్నారు. వీటిని తిరస్కరిస్తున్నప్పటికీ.. మరింత ఊరించేలా సందేశాలు పంపుతూ, టెంప్ట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్లు పంపిన లింక్స్ క్లిక్ చేస్తే మాత్రం.. మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులు కూడా మాటుమాయం అవుతాయి.…
Andhra Pradesh: విశాఖకు చెందిన సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 19న జరిగిన మిసెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో విజేతగా నిలిచారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళగా సరోజ నిలిచారు. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’, ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డులు’ కూడా దక్కాయి. అల్లూరి సరోజ ఫైనల్‌కు ముందు జరిగిన వివిధ రౌండ్‌లలో పోటీ పడ్డారు. తన విభాగంలో గ్రాండ్…
What’s Today: * నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటన.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం జగన్ * అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్ధిక శాఖ సీఎం జగన్ సమీక్ష.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పథకాలకు నిధులపై సమావేశంలో చర్చ * అమరావతి: నేడు మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో చిత్తూరు కోర్టులో…
హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి ట్రాపిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. గీత దాటితే దాట తీస్తామంటున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. నగరంలో రాంగ్సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
Relationship: దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే ప్రేమతో పాటు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. భర్త ఇష్టాలను భార్య, భార్య ఇష్టాలను భర్త ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గౌరవించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అయితే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతుంది. కానీ చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలివేయాలి. ముఖ్యంగా పట్టింపులకు పోతే ఆ బంధం అక్కడితోనే తెరపడే అవకాశం…
Telugu Desam Party: టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 1న తూ.గో. జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. కొవ్వూరులో చంద్రబాబు పర్యటించడంతో పాటు బహిరంగ సభలోనూ పాల్గొంటారు. పార్టీ అధినేత వస్తున్న నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కమిటీలో సుబ్బరాయచౌదరి, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు సభ్యుల కమిటీ సభా వేదికపైకి వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవడం…
Rain Alert: ఏపీ ప్రజలను మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేయనున్నాయి. ఐఎండీ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి శ్రీలంకకు తూర్పున 600 కి.మీ. దూరంలో, తమిళనాడులోకి కారైకల్‌కు 630 కి.మీ. దూరంలో, చెన్నై తీరానికి 670 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. నెమ్మదిగా వాయుగుండం కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని…
Olympics: క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సి్ల్ (ఐసీసీ) చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. నిజానికి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగినా ఇవి ఫలించలేదు. ఎట్టకేలకు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు చోటు ఉండవచ్చని తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ బ్రిటీష్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ ప్రకటించింది. గత 100 సంవత్సరాలలో మొదటిసారిగా క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడలలో చేర్చనున్నట్లు…
Sandhya Devanathan: ప్రస్తుతం సోషల్ మీడియాను ఏలుతున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సంస్థలు మెటాలో భాగమయ్యాయి. అయితే ఆయా సంస్థలు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్య దేవనాథన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఆమె నేపథ్యం గురించి చాలా మందికి తెలియదు. 46 ఏళ్ల సంధ్య దేవనాథన్ ఏపీలోని విశాఖలోనే చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1994లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో…
Covaxin: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్ టీకాకు వేగంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఆరోపణలు తప్పుదోవ పట్టించే అసత్య వార్తలు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ బయోటెక్ తన టీకా తయారీలో కొన్ని ప్రక్రియలను వదిలేసిందని.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా క్లినికిల్ పరీక్షలను వేగవంతం చేసిందని మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. భారత ప్రభుత్వం, జాతీయ నియంత్రణ సంస్థ సీడీఎస్సీఓ కొవాగ్జిన్ టీకాకు అత్యవసర…