Janasena Party: జనసేన పీఏసీ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Party: అమరావతిలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఏసీ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల పవన్ విశాఖ పర్యటనపై తీర్మానాన్ని జనసేన పార్టీ ప్రవేశపెట్టింది. పవన్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ వైసీపీ వ్యవస్థలను దుర్వినియోగం చేసి భయానక పరిస్థితులను సృష్టించిందని తీర్మానంలో ఆరోపించింది. ఈ చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియజేశారని వెల్లడించింది.
అటు కేంద్రమంత్రి మురళీధరన్, టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, లోక్ సత్తా పార్టీ నేతలు జయప్రకాష్ నారాయణ, బాబ్జీ ఈ చర్యలను ఖండించి పవన్ కళ్యాణ్‌కు సంఘీభావం తెలిపారని వివరించింది. తెలంగాణకు చెందిన పలువురు నేతలు, పౌర సమాజం నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు, మేధావులు ఈ చర్యలను తప్పుబట్టి సంఘీభావం తెలిపారని జనసేన పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి తీర్మానం చేసినట్టు వెల్లడించింది. విశాఖలో 180 మందిపై వివిధ సెక్షన్లతో అక్రమ కేసులు నమోదు చేశారని, వారిలో 28 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారని జనసేన తన ప్రకటనలో తెలిపింది. అరెస్ట్ చేసిన నేతలను అర్ధరాత్రి బలవంతంగా గుర్తుతెలియని ప్రాంతాలకు తరలించారని ఆరోపించింది.
Also Read
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
Read Also: Pawan Kalyan Pressmeet Live: జనసేనానిపై కుట్ర?
కేసుల కారణంగా పోలీస్ స్టేషన్ల పాలైన నేతలు, వీర మహిళలు, జనసైనికులు, వారి కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యం నింపిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు రెండో తీర్మానం చేసినట్టు జనసేన వివరించింది. విశాఖ అక్రమ కేసుల్లో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నేత మన కుటుంబ సభ్యుడే అన్న భావనతో, వారిని కాపాడుకునే బాధ్యతను స్వీకరిస్తూ ఈ నెల 18వ తేదీన జరిగిన సమావేశంలో తీర్మానం చేశారని, ఆ తీర్మానాన్ని నేటి సమావేశంలో బలపర్చినట్టు జనసేన వెల్లడించింది. అక్రమ కేసుల్లో ఉన్నవారికి న్యాయపరమైన సహాయం అందించిన పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ తీర్మానం చేసినట్టు జనసేన పార్టీ పేర్కొంది.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు.. pic.twitter.com/v6HdNZnj9F
— JanaSena Party (@JanaSenaParty) October 30, 2022
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..