బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిందితులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.
భారతీయ కస్టమర్లలో స్కూటర్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. గత నెల అంటే డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. మరోసారి హోండా యాక్టివా అగ్రస్థానాన్ని సాధించింది. గత నెలలో 1,20,981 యూనిట్ల హోండా యాక్టివా స్కూటర్లు విక్రయించారు. కానీ.. గతేడాదితో పోలిస్తే.. యాక్టివా విక్రయాలు 16.18 శాతం క్షీణించాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లను చూద్దాం..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 17న థియేటర్లలో విడుదలైంది.
చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ఈ ఏడాది నామినేషన్లను ప్రకటించారు. గురువారం లాస్ ఏంజిల్స్‌లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ 2025కి నామినేట్ చేయబడిన పేర్లను వెల్లడించారు.
ఇవి నేతాజీ చెప్పిన మాటలు.. నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరారు. కానీ.. బాపూ నిర్ణయాలనే నిర్మొహమాటంగా విభేదించారు బోస్. నేతాజీ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి, ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యద్ధం చేశాడు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా…
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదల్ గ్రామం ఒక మర్మమైన వ్యాధి కారణంగా 17 మంది మరణించిన తరువాత కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించబడింది. మృతుల్లో 13 మంది చిన్నారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం గ్రామంలో బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 163 (అంతకుముందు ఇది సెక్షన్ 144) విధించింది. బాధిత కుటుంబాల ఇళ్లను సీలు చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ.. "బాధల్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాం. గ్రామాన్ని మూడు జోన్‌లుగా విభజించాం. అన్ని…
నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. చిట్ చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. "కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది.. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారు. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రూ.382 కోట్ల కొత్త కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో ఓ నాయకుడు కాగ్ రిపోర్టు తెచ్చి కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవాడని, ఇప్పుడు అదే కాగ్ రిపోర్టులే వారి అవినీతిని చెబుతున్నాయన్నారు. 14 కాగ్ నివేదికలు వచ్చాయని అజయ్ మాకెన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.382 కోట్ల ఆరోగ్య…
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు.. ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది. లక్షలాది మంది భక్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.