జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదల్ గ్రామం ఒక మర్మమైన వ్యాధి కారణంగా 17 మంది మరణించిన తరువాత కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించబడింది. మృతుల్లో 13 మంది చిన్నారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం గ్రామంలో బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 163 (అంతకుముందు ఇది సెక్షన్ 144) విధించింది. బాధిత కుటుంబాల ఇళ్లను సీలు చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ.. “బాధల్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాం. గ్రామాన్ని మూడు జోన్‌లుగా విభజించాం. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సమావేశాలు నిషేధించాం. బాధిత కుటుంబాలకు ఆహారం, నీటిని సరఫరా చేశాం. పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాం. ” అని తెలిపారు.
READ MORE: Jammu Kashmir: అంతుచిక్కని వ్యాధితో 17 మంది మృతి.. కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటన
ఆరోగ్య, పోలీసు శాఖలకు కఠిన సూచనలు..
మంగళవారం అర్ధరాత్రి ఆరోగ్య, పోలీసు శాఖలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటల్ దుళ్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏడీజీపీ జమ్మూ, డీఐజీ రాజౌరి-పూంచ్ రేంజ్, జిల్లా కమీషనర్ రాజౌరి, జీఎంసీ జమ్మూ, రాజౌరి ప్రిన్సిపాల్‌తో సహా అనేక జాతీయ ఆరోగ్య సంస్థల నిపుణులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, పోలీసు శాఖలను ఆదేశించారు. గ్రామ జనాభాను పర్యవేక్షించేందుకు రెండు శాఖలు సరైన ఎస్‌ఓపీని సిద్ధం చేయాలని సూచించారు. గ్రామంలో తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించి ఎస్‌ఓపీలు పాటించేలా చూడాలని ఆరోగ్య, పోలీసు శాఖలను కోరారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తులు పరీక్షించిన తర్వాతే ఆహారం తినడానికి అనుమతింస్తారు. ఈ మరణాలకు అసలు కారణాలు తెలిసే వరకు.. పోలీసులు, ఆరోగ్య నిపుణులు నిర్దేశించిన విధానాల ప్రకారం.. దర్యాప్తును కొనసాగుతుంది.