చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ఈ ఏడాది నామినేషన్లను ప్రకటించారు. గురువారం లాస్ ఏంజిల్స్‌లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ 2025కి నామినేట్ చేయబడిన పేర్లను వెల్లడించారు. ఈ నామినేషన్‌లో ఇండియన్-అమెరికన్ చిత్రం ‘అనుజ’ (హిందీ భాషా చిత్రం) కూడా బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చేరింది. మొదటి నామినేషన్లను జనవరి 17న ప్రకటించాల్సి ఉండగా, లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదం కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 23న నామినేషన్లను ప్రకటించారు. నామినేట్ చేయబడిన వారికి మార్చి నెలలో అవార్డులు ఇవ్వనున్నారు. భారత కాలమానం ప్రకారం.. విజేత పేరు మార్చి 3 ఉదయం 5:30 గంటలకు ప్రకటిస్తారు.
1) ఉత్తమ నటుడు..
అడ్రియన్ బ్రాడీ- (ది బ్రూటలిస్ట్)
తిమోతీ చలమెట్ – (ఐ యామ్ స్టిల్ హియర్)
కోల్మన్ డొమింగో- (సింగ్ సింగ్)
రాల్ఫ్ ఫియన్నెస్- (కాన్క్లేవ్)
సెబాస్టియన్ స్టాన్ – (ది అప్రెంటిస్)
2) ఉత్తమ నటి..
సింథియా ఎరివో- (విక్డ్)
కార్లా సోఫియా గాస్కోన్- (ఎమిలియా పెరెజ్)
మిక్కీ మాడిసన్- (అనోరా)
డెమి మూర్ – (ది సబ్ స్టాన్స్)
ఫెర్నాండా టోర్రెస్- (ఐ యామ్ స్టిల్ హియర్)
3)ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం..
ఐ యామ్ స్టిల్ హియర్ – బ్రెజిల్
ది గర్ల్ విత్ ది నీడిల్- డెన్మార్క్
ఎమిలియా పెరెజ్-ఫ్రాన్స్
ది సీడ్ ఆఫ్ ది సేక్రేడ్ ఫిగ్- జర్మనీ
ప్రవాహం- లాట్వియా
4) ఉత్తమ చిత్రం..
అనోరా
ది బ్రూటలిస్ట్
ఎ కంప్లీట్ అన్‌నోన్
కాన్‌క్లేవ్
డ్యూన్: పార్ట్2
ఎమిలియా పెరెజ్
ఐయామ్ స్టిల్ హియర్
నికెల్ బాయ్స్
ది సబ్‌స్టాన్స్
విక్డ్
5) ఉత్తమ దర్శకుడు..
షాన్ బేకర్- (అనోరా)
బ్రాడీ కార్బెట్- (ది బ్రూటలిస్ట్)
జేమ్స్ మ్యాన్‌గోల్డ్ (ది కంప్లీట్ అన్‌నోన్)
జాక్వెస్ ఆడియార్డ్- (ఎమిలియా పెరెజ్)
కార్లే ఫర్జెట్- (ది సబ్‌స్టాన్స్)
6) ఉత్తమ సహాయ నటి పాత్ర..
మోనికా బార్బరో- (ది కంప్లీట్ అన్‌నోన్)
అరియానా గ్రాండే- (విక్డ్)
ఫెలిసిటీ జోన్స్- (ది బ్రూటలిస్ట్)
ఇసాబెల్లా రోసెల్లిని- (కాన్క్లేవ్)
జోయ్ సల్డెనా- (ఎమిలియా పెరెజ్)