బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 17న థియేటర్లలో విడుదలైంది.
READ MORE: MEA : ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఖలిస్థాన్ ఉగ్రవాది హాజరు.. స్పందించిన భారత్
కాగా.. కంగనా రనౌత్ ఇటీవల విడుదలైన ‘ఎమర్జెన్సీ’కి లండన్‌లో భారీ వ్యతిరేకత ఎదురవుతోంది. ఇక్కడ కొందరు సినిమా చూస్తున్న ప్రేక్షకులను భయపెట్టి బెదిరించినట్లు సమాచారం. ఈ విషయంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరుల సమావేశంలో ఈ సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.
READ MORE: Medchal Murder Case : మేడ్చల్‌లో యువతి హత్య.. వెలుగులో కీలక విషయాలు
ఈ చిత్రాన్ని అనేక థియేటర్లలో ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారన్న వార్తా నివేదికలు తమ దృష్టికి వచ్చాయన్నారు. భారత వ్యతిరేక మూకల నుంచి వచ్చే బెదిరింపులు, హింసాత్మక నిరసనల అంశాలను యూకే ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. ఈ సినిమాను ప్రదర్శించడంలో అడ్డంకులు కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. యూకే ప్రభుత్వం ఈ విషయంలో సరైన విధంగా స్పందిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. భారత దౌత్య కార్యాలయం ద్వారా అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వెల్లడించారు.