Bengaluru Shocker: భార్య ప్రాణం తీసిన ‘‘సాంబార్’’ గొడవ..
- కాపురంలో చిచ్చుపెట్టిన సాంబార్ గొడవ..
- భర్త తిట్టాడని ఆత్మహత్య చేసుకున్న భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Shocker: చిన్న చిన్న కారణాలే కుటుంబాల్లో కల్లోలాలు రేపుతున్నాయి. మనస్పర్థలతో ఆత్మహత్యలు, హత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్‌లో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న ఘటన భార్య ఆత్మహత్యకు కారణమైంది. 3 రోజుల క్రితం నాటి ‘‘సాంబార్’’ను పదే పదే వడ్డించడంపై జరిగిన వివాదంలో 27 ఏళ్ల మహిళ మృతి చెందింది. గురువారం సాంబార్ విషయంలో భర్తతో జరిగిన గొడవ తర్వాత కావ్య అనే మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
Read Also: Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
కావ్యకు రంగస్వామితో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల బిడ్డ ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మూడు రోజుల క్రితం తయారు చేసిన సాంబార్‌ను మళ్లీ వేడి చేసి వడ్డించి తర్వాత దంపతుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో భర్త, కావ్యను తీవ్రంగా దుర్భాషలాడాడు. ఆమెపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘర్షణ తర్వాత కావ్య వ్యవసాయం కోసం వినియోగించే పురుగుల మందు సేవించిందని చెబుతున్నారు. వాంతులు కావడంతో ఆమె పురుగుల మందు తాగిందనే విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?