బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిందితులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కారు నంబరు ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
READ MORE: IND vs ENG: భారత్ జోరును ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా! నేడే రెండో టి20
యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. లేదా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బైక్‌లు, కార్లలో వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు ప్రమాదాల్లో అనామకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనదారులు వేగంగా ప్రయాణిస్తూ.. కంట్రోల్ చేయలేక ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. రాయదుర్గం, గచ్చిబౌలి, బంజారహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
READ MORE: KCR: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..