భారతీయ కస్టమర్లలో స్కూటర్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. గత నెల అంటే డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. మరోసారి హోండా యాక్టివా అగ్రస్థానాన్ని సాధించింది. గత నెలలో 1,20,981 యూనిట్ల హోండా యాక్టివా స్కూటర్లు విక్రయించారు. కానీ.. గతేడాదితో పోలిస్తే.. యాక్టివా విక్రయాలు 16.18 శాతం క్షీణించాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లను చూద్దాం..
READ MORE: K.A.Paul: మరో సంవత్సరంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారు.. సంచలన వ్యాఖ్యలు
ఈ విక్రయాల జాబితాలో టీవీఎస్ జూపిటర్ రెండో స్థానంలో నిలిచింది. 48.93 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 88,668 యూనిట్ల స్కూటర్లను కంపెనీ విక్రయించింది. అయితే ఈ విక్రయాల జాబితాలో సుజుకి యాక్సెస్ మూడవ స్థానంలో ఉంది. మొత్తం 52,180 మంది కొత్త కస్టమర్లు సుజుకి యాక్సెస్ ని సొంతం చేసుకున్నారు. ఈ విక్రయాల జాబితాలో బజాజ్ చేతక్ నాలుగో స్థానంలో నిలిచింది.
READ MORE:MEA : ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఖలిస్థాన్ ఉగ్రవాది హాజరు.. స్పందించిన భారత్
బజాజ్ చేతక్ ఈవీని 21,020 మంది కొత్త కస్టమర్లు కొన్నారు. మరోవైపు.. ఈ విక్రయాల జాబితాలో సుజుకి బర్గ్‌మన్ ఐదవ స్థానంలో ఉంది. 107.26 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 20,438 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్ ఐక్యూబ్ ఆరో స్థానం, TVS Ntorq ఏడవ స్థానం, ఎనిమిదవ స్థానంలో హోండా డియో, తొమ్మిదవ స్థానంలో హీరో ప్లెజర్ నిలిచాయి. డిసెంబర్‌లో Ola S1 మొత్తం 13,771 యూనిట్ల కొత్త స్కూటర్లను విక్రయించి పదో స్థానానికి పరిమితమైంది.