బడ్జెట్ కు వారం రోజుల ముందు దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ నష్టాన్ని చవిచూసింది. స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు పడిపోయిన కారణంగా.. కంపెనీ మార్కెట్ క్యాప్ నుంచి దాదాపు రూ.75 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.74,969.35 కోట్లు తగ్గి రూ.16,85,998.34 కోట్లకు చేరుకుంది. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం రావడంతో కంపెనీ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. మరోవైపు, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్‌లో…
నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టా అని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. గతంలో తనకు న్యాయం జరగదు అనే భావం ఉండేదని.. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. "పీవీ సునీల్ కుమార్ వెనుక ఉన్న ఆర్మీని చూసి భయపడుతున్నారా? వాళ్ల దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతూ ఉంది..
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ. 97,500 లుగా ఉంది.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో ప్రతిష్టాత్మక నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 98 మందికి 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ పాలకులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే మేము 20% పెంచి రైతు భరోసా ఇస్తున్నాం.
అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరని తెలిపారు. "వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తాం. ఉపాధి హామీలో నమోదై, కనీసం ఇరవై రోజులు పని చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తాం. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం నాలుగు పథకాలపై…
కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. "అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం.
బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన షార్ట్ ఫిలిం దర్శకుడుగా గుర్తించారు. ప్రమాదం తరువాత.. కారును వదిలిపెట్టి నిందితుడు పారిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది.. స్నేహితులతో మద్యం సేవించి ఉండటం కారణంగా ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు? తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.
హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఘట్కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయ్యింది. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి హైడ్రా.. అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి, కూల్చివేతలకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకి కోర్టులో ఊరట దక్కలేదు. అటు ఇంటర్ బోర్డు కూడా వెనక్కి తగ్గడం లేదు. మిక్స్డ్ అక్యుపెన్సీ భవనాల్లో నడుస్తున్న కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం బోర్డు లక్ష రూపాయలు ఫైన్ వేసింది. దీంతో కొన్ని కాలేజి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రేపే ఇంటర్ ఫీజ్ కట్టేందుకు చివరి తేదీ కావడంతో ఈ లక్ష రూపాయలు కట్టేందుకు కళాశాలలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి విద్యార్థి వద్ద లేట్ ఫీ రూపంలో 2 వేల 500…