చంద్రబాబు గత పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇచ్చిన చరిత్ర లేదని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు.. గత వైసీపీ హయంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు.. జగన్ పేదల ఇళ్ల స్థలాల కోసం 15 వేల కోట్లతో భూములు కొనుగోలు చేశారన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా పేదల స్థలాల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు..
వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుడు... వృద్ధురాలు.. ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. రాజమండ్రి లాలాచెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ అరుదైన వివాహం జరిగింది. వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ... రాజమండ్రి నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు.
తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు వైసీపీని ప్రజలు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదన్నారు.
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ తో దూసుకెళుతూ వందకోట్ల క్లబ్ లో చేరింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం…
హోండా తన పాపులర్ డియో స్కూటర్ యొక్క 2025 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,930గా నిర్ణయించింది. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే దాదాపు రూ. 1500 ఎక్కువ. 2025 వెర్షన్‌లో జపాన్ కంపెనీ దానిలో పలు మార్పులు చేసింది. OBD2B కంప్లైంట్ ఇంజిన్‌ను అందించింది.
మహీంద్రాకు చెందిన బీఈ6 గురించి తెలిసిందే. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP)లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 31.97 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్‌తో బీఈ6 ఇప్పుడు భారతీయ రోడ్లపై రెండవ సురక్షితమైన ఎస్‌యూవీగా అవతరించింది.
మారుతీ సుజుకి ఇండియా ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది. కంపెనీ ఈరోజు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. కంపెనీ మార్చిలో పూర్తి ఫ్లాష్‌ని లాంచ్ చేస్తుంది. భారతీయ మార్కెట్లో ప్రవేశించనున్న విటారా ఈవీ.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. ఈ కారులో మీరు ప్రత్యేక ఫీచర్ల గురించి…
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలనగర్ లో ప్రేమ వ్యవహారం, పసి పాపకు శాపంగా మారింది. గోపాల నగర్ లో నివాసం ఉంటున్న ప్రదీప్, అదే ప్రాంతానికి చెందిన యువతి స్వాతి ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడు. పలు మార్లు యువతి బంధువులు హెచ్చరించారు. ప్రదీప్ తన శైలి లో మార్పు రాకపోగా.. స్వాతికి, పువ్వులు పంపడంతో స్వాతి బాబాయ్ వివేక్‌నంద ఆగ్రహానికి గురయ్యారు.
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా కొందరు మాత్రం అంత త్వరగా మానరు. అయితే.. ప్రస్తుతం యువత వాటికి బానిసలుగా మారుతున్నారు. టీతో పాటు ఓ సిగరెట్ తాగుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ అధ్యయనం వారికి కీలక విషయాన్ని తెలిపింది. ప్రముఖ యురాలజిస్ట్ మార్క్ లానియాడో ‘మిర్రర్’ గతంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ధూమపానం వల్ల పురుషాంగం కుచించుకుపోవడమే కాకుండా అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నారు.
పండగ పూట మటన్, చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో నాన్ వెజ్ తినే వారికి ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రెండ్రోజులు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ ఏదైనా మటన్.. చికెన్ కంపల్సరీ..