హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లను.. నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేల కోట్లు రైతుకు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా మరో రూ. 3 వేల కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు.
ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని.. సోనియా పుట్టిన రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చెయ్యలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు.. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు.. అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు.
Whats Today: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. ఆదివారం సెలవు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు. ముక్కంటిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు. తిరుమల: రేపు ఆన్ లైన్ లో పిభ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చెయ్యనున్న…
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియ. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్న అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్. * నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. జార్ఖండ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్ ఫిగర్ 41…