Kishan Reddy: అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలి
- ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి?
- అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని.. సోనియా పుట్టిన రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా అమలు చెయ్యలేదని విమర్శించారు. ఏడాదిలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి అంటూ ప్రశ్నలు గుప్పించారు. బెదిరింపులు.. తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు.. అక్రమ కేసులు తప్ప కాంగ్రెస్ సాధించింది లేదన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ ఎన్‌డీఏ ఏంటని అడుగుతున్నారని.. తన డీఎన్‌ఏ బీజేపీదని.. మిగతా వాళ్ల లాగా పది పార్టీలు తిరిగిన డీఎన్‌ఏ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద డిసెంబర్ 1 నుంచి 5 వరకు బీజేపీ ప్రచారం చేయనుందన్నారు.
తెలంగాణ బీజేపీ పార్లమెంట్, శాసన సభ్యులు పీఎంను కలిశామన్నారు. ఇవాళ 12 గంటలకు ప్రధానిని కలిశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ లో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారన్నారు. కేంద్ర పథకాలను సమగ్రంగా అమలు చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు పని చెయ్యాలని దిశా నిర్దేశం చేశారన్నారు. మహేశ్వర్ రెడ్డి మినహా ప్రధానినీ అందరం కలిశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రధానితో సమావేశం అనంతరం మేమంతా ప్రత్యేకంగా సమావేశమయ్యామన్నారు. ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు, గ్యారంటీలు.. సబ్ గ్యారంటీలు ఇవ్వడం జరిగిందన్నారు. సమస్యలపై మాట్లాడితే కేసీఆర్ ఎలా వ్యక్తిగతంగా దాడి చేసే వారో.. ఇపుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారన్నారు.
Also Read
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
విపక్షాలను తిట్టడం మీద పెట్టే దృష్టి పాలన మీద పెడితే.. రాష్ట్రం పరిస్థితి బాగుంటుందన్నారు. కానీ సీఎం దీన్ని పట్టించుకోవడం లేదన్నారు. రెండ్రోజుల క్రితం కొమురంభీం జిల్లాలో.. శైలజ అనే అమ్మాయి.. ఫుడ్ పాయిజనింగ్‌తో చనిపోయిందన్నారు. దీని మీద సీఎం కనీసం దృష్టిపెట్టరన్నారు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయరన్నారు. సంబంధం లేని విషయాలపైనా ఆయనకు ఆసక్తి ఎక్కువ అంటూ విమర్శించారు. అందుకే బీజేపీ తరపున.. రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా.. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనమీద దృష్టిపెట్టాలని కోరుతున్నామన్నారు. రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో.. తెలంగాణ నష్టపోతోందన్నారు. తెలంగాణ గతంలో బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కారణంగా.. రాష్ట్రం నష్టపోతోందని విమర్శలు గుప్పించారు. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతోందని మండిపడ్డారు.
Read Also: Kaleshwaram Commission: రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఎన్‌డీఎస్ఏ నివేదిక ఆలస్యం..
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత దాడులు.. అసాధ్యమైన అంశాల్లో.. ప్రజలను మభ్యపెట్టేలా పనులు చేయడంలో ఇద్దరూ ఇద్దరేనన్నారు. కాంగ్రెస్ వాళ్లు.. బీఆర్ఎస్ వాళ్లను చేర్చుకున్నారని.. బీఆర్ఎస్ వాళ్లు.. కాంగ్రెస్ వాళ్లను చేర్చుకున్నారన్నారు. చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని.. సకాలంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పినా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నిస్సిగ్గుగా.. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారు బీఆర్ఎస్‌లో చేరి.. మంత్రులయ్యారన్నారు. ఆ పార్టీ నాయకులు.. అక్కడ గెలిచి.. ఇక్కడ మంత్రులయ్యారని.. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకన్నా రికార్డులు, సాక్ష్యాలు ఇంకేం కావాలన్నారు. ప్రభుత్వాలు హామీల అమలుకు సమయం ఇవ్వాలని.. కానీ రెండ్రోజుల్లో హామీలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం.. వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని.. సోనియా గాంధీ పేరుతో లేఖలు పంపడం.. నిజం కాదా అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. నిరుద్యోగులు.. రాహుల్, రేవంత్ చెప్పిన మాటలను విని మోసమోయారన్నారు. జాబ్ క్యాలెండర్ల విడుదలతో యువతను మోసం చేశారని విమర్శించారు. రైతులకు రైతు భరోసా.. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బుల సంగతేంది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Bhatti Vikramarka: రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!
“మహిళలకు రూ.2,500 ఇస్తామన్న సంగతేమైంది? నిరుద్యోగ భృతి, ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు? ఎందరికి అందింది? సుమారు 13 పంటలకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. కనీసం వరికి కూడా ఇవ్వకుండా.. సన్నబియ్యం, దొడ్డు బియ్యం అని కొత్త రూల్స్ జోడించడం దారుణం. ధాన్యం కొనుగోలును.. కేంద్రం డబ్బులిచ్చి కొంటుంటే.. కొనుగోలు కేంద్రాల నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదు. మహిళలకు సంబంధించి.. తులం బంగారం, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్, దివ్యాంగుల పింఛన్.. ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఉన్నది సరిగ్గా ఇవ్వడం లేదు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉన్న రేషన్ కార్డులే ఇంకా నడుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు అవుతున్నా.. తెలంగాణ రాష్ట్రం లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేక పోవడం దురదృష్టకరం. పాలనమీద దృష్టిపెట్టాలని కాంగ్రెస్ కు సూచిస్తున్నాను. ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలి.ఎవరైనా సమస్యమీద మాట్లాడితే.. వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం, దిగజారి మాట్లాడే ప్రయత్నం సరికాదు. అప్రజాస్వామిక భాష మాట్లాడటాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే.. రేవంత్ కొనసాగిస్తున్నాడు.
అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది. కాంగ్రెస్ పాత అలవాటు ప్రకారం.. అవినీతి విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నది. గతంలో.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పులమీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపితే.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. చిన్న చిన్న పట్టణాలకు కూడా డెవలప్ మెంట్ అథారిటీలు ఏర్పాటుచేసి.. డబ్బులు ఖర్చుచేస్తున్నారు. 30వ తేదీనాడు.. దీనిపై విస్తృతస్థాయిలో హైదరాబాద్ లో చర్చిస్తాం. ఆ తర్వాత డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్తాం. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం. అమెరికాలో చట్టాల అమలు విషయం అక్కడి ప్రభుత్వం చూసుకుంటుంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు.. ఏదో ఒక ఇలాంటి అంశాన్ని సృష్టించి.. కుట్ర చేస్తున్నారు. ఇది కుట్రపూరితమైన చర్య. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. చేయదు. ప్రజాసమస్యల మీద పోరాడండి, కేంద్రప్రభుత్వ పథకాలు అమలుచేయండి.క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా పనిచేయాలని మోదీ గారు సూచించారు. ఆ మార్గంలోనే మేం ముందుకెళ్తున్నాం. డిసెంబర్ చివరి నాటికల్లా.. సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయి. పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుంది.”అని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!