రోజురోజుకి చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రికార్డు స్థాయిలో ధరలు కొండెక్కాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా టమాట ధరలు ఆకాశానంటుతుండగా.. ఉల్లి సామాన్యులను కంటతడి పెట్టిస్తోంది.ఇప్పుడు చికెన్ ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు కోడి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు. ఒక్క చికెన్ ధరలు మాత్రమే కాదు.. మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి. శుభకార్యాల సీజన్ కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో కిలో చికెన్ స్కిన్ లెస్ ధర రూ. 280 నుంచి రూ. 300…
జగనన్న తోడు నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్ సర్కార్ జగనన్న తోడు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2020 నవంబర్ నుండి 2021 సెప్టెంబర్ వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం వల్ల 4,50,546 మంది చిరు వ్యాపారస్తులు…
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యుల జేబులకు చిల్లులు వేయడానికి రెడీ అయిపోయాయి. రెండు రోజుల స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులు షాక్ కు గురయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు అంటున్నారు. బుధవారం పెట్రోల్ పై 37 పైసల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46 లకు చేరుకుంది. ఇక డీజిల్ పై 38 పైసలు పెంచగా…