జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయని కార్పొరేటర్లు విమర్శలు గుప్పించారు.
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు.
Mahesh Babu : ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలైంది మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా. ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని యావరేజ్ గా నిలిచింది.
ఇటీవల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. ఫ్రీ లాంచ్ ఆఫర్ ,బై బ్యాక్ పాలసీ పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిండా ముంచుతున్నాయి. ఒక సైబరాబాద్‌లోనే 22 ఫ్రీ లాంచ్ ఆఫర్, 12 బై బ్యాక్ పాలసీ పేరుతో సంస్థలు మోసానికి పాల్పడ్డాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను కేంద్రం సస్పెండ్ చేసింది. ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్‌పోర్టును కేంద్రం సస్పెండ్ చేసింది. పాస్‌పోర్ట్ సస్పెండ్‌ను ప్రభాకర్ రావు సవాల్ చేశారు.
పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 100 మార్కులతో ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్ విధానంను వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యుత్తు రంగంలో విధ్వంసానికి ప్రజా ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83 వేల కోట్ల అప్పులు చేసి ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్ధితి నుంచి తెలంగాణ మళ్లీ తలెత్తుకునే నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్తు రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.