Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది..
Asian Hockey Champions Trophy: రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ -2024లో భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి మలేషియాపై 4-0తో విజయం సాధించింది. భారత మహిళల హాకీ జట్టు తరఫున సంగీత కుమారి రెండు గోల్స్ చేయగా.. ప్రీతి దుబే, ఉదిత ఒక్కో గోల్ చేశారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో రెండో క్వార్టర్ మినహా మిగిలిన మూడు క్వార్టర్లలో భారత్ గోల్స్ చేసింది. తొలి…
వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. టీడీపీ- జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీ ది 10 శాతం కూడా లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా.. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలనా అంటూ ప్రశ్నించారు.
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన డీ రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించారు. కె.కన్నబాబుకు మున్సిపల్, పట్నాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నెల్లూరులో రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు. లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు ప్లాన్ సమర్పిస్తే చాలు అని పేర్కొన్నారు.