T20 World Cup: పాకిస్తాన్ ట్రాప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. యూనస్ సంతోషం కోసమే డ్రామా..
- పాకిస్తాన్ ట్రాప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు..
- మోహ్సిన్ నఖ్వీ ద్వారా అమీనుల్ ఇస్లాం ప్రభావం..
- మాజీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: భారతదేశానికి వ్యతిరేకంగా, భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత వేదికలపై ఆడనంటూ రచ్చ చేసింది. తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ(ICC) ఒప్పుకోలేదు. ఫలితంగా బంగ్లాదేశ్ ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్( T20 World Cup 2026) నుంచి బయటకు వెళ్లింది. అయితే, అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ పాకిస్తాన్‌తో కలిసి భారత్‌కు వ్యతిరేకంగా ఆడిన ఆటలో బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ వివాదంపై మాజీ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) సీఈఓ సయ్యద్ అష్రఫుల్ హక్ సంచలన వ్యాక్యలు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉచ్చులో పడినట్లు ఆయన చెప్పారు. ‘‘బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చీఫ్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ప్రభుత్వాన్ని సంతోషపెట్టడం కోసం ఉచ్చులో పడ్డాడు’’ అని అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) చైర్మన్ మోహ్సీన్ నఖ్వీ, అమీనుల్ ఇస్లాంను తప్పు దారి పట్టించి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ రెచ్చగొట్ట ఉండొచ్చని అన్నారు.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
Read Also: Team Rankings: సూపర్-8 టీమ్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో జింబాబ్వే, భారత్ స్థానం ఎంతంటే?
పాక్ ప్రభావితం చేయడం వల్లే బంగ్లాదేశ్ ప్లేయర్లు కీలకమైన టోర్నీని ఆడకుండా ఉన్నారని హక్ చెప్పారు. లిటన్ దాస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నజ్ముల్ శాంటో వంటి ఆటగాళ్లు 30 ఏళ్లలో ఉన్నారు, ఈ ప్రపంచ కప్‌లో ఆడకపోవడం బంగ్లా క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పారు. భారత్ తర్వాత, క్రికెట్ ను పిచ్చిగా ఆరాధించే దేశాల్లో బంగ్లాదేశ్ ఉంటుందని, ఇలాంటి టోర్నీ నుంచి బయటకు రావడం అభిమానుల్ని, ప్లేయర్లను నిరాశకు గురిచేసి ఉంటుందని చెప్పారు.
భారత్‌లో ఆడటానికి ఎలాంటి భద్రత సమస్యలు లేవని, ఐసీసీ సరైన భద్రత ఇచ్చదేని, కావాలంటే బంగ్లాదేశ్ సెక్యూరిటీ విషయంలో అదనపు హామీలు అడగాల్సిందని ఆయన అన్నారు. బీసీసీఐ, భారత ప్రభుత్వంతో చర్చలు జరిపితే సమస్య పరిష్కారమయ్యేదని ఆయన చెప్పారు. ఇది అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ క్రికెట్ ఇమేజ్‌ను దెబ్బతీసిందని, ఇది దౌత్యపరంగా పెద్ద వైఫల్యమని ఆయన అన్నారు. అమీనుల్ ఇస్లాంకు అనుభవలేమి, ప్రభుత్వాన్ని సంతోషపెట్టడానికి, పీసీబీ ప్రభావంతో తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌కు పెద్ద నష్టం తెచ్చిందని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?