ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కిరెడ్డిపాలెంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా గుర్తించారు.
మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిసరాలలో డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఇటీవల ఓ యూట్యూబర్ చిన్న వెంకన్న ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారు. వీడియోలను తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో యూట్యూబర్ పోస్ట్ చేశాడు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి తెగబడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి మావోయిస్టులు హత్య చేశారు. మృతుడు భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కుమ్మేష్ కుంజమ్‌గా గుర్తించారు.
గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి రహదారులపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పౌరసరఫరాల శాఖ విభాగం పై…
దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్న ఆచార్య కొఠారి మాటలను ప్రజా ప్రభుత్వం ఆచరణలో చూపుతోంది.. నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విద్యా రంగంలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విప్లవాత్మకమైన చర్యలను చేపట్టింది. స్థానిక అవసరాలే కాకుండా ప్రపంచ అవసరాలను తీర్చే నైపుణ్యాలను తెలంగాణ బిడ్డలు ఒడిసిపట్టేలా సాంకేతిక విద్యకు కొత్త మెరుగులు దిద్దుతోంది.