High Court: హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు తెలిపింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లను.. నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. డిసెంబర్ 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయని సర్కారు తెలిపింది. 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. నోటిఫికేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం 3 నెలల గడువు కోరింది. తెలంగాణ హైకోర్టు అందుకు నిరాకరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: PM Modi: తెలంగాణ ప్రజలు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు..