* ఢిల్లీ: నేడు 75 వ “భారత రాజ్యాంగం” దినోత్సవం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఘనంగా “భారత రాజ్యాంగం దినోత్సవాలు”.. “హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్” నినాదంతో ఏడాది పొడవునా 75 వ “భారత రాజ్యాంగం దినోత్సవాలు”
* నేడు 75వ భారత రాజ్యాంగ దినోత్సవం.. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత రాజ్యాంగ ఉత్సవాలు.. పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్‌కర్.. ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్, ఉభయసభల సభ్యులు.. వేడుకల్లో 75వ భారత రాజ్యాంగ దినోత్సవాల నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల
* ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం.. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చ
* నేడు ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసుల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా.. పలు చోట్ల సింగిల్ డిజిట్ కి పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు.. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 9.3, న్యాల్కల్ 9.6, గుమ్మడిదలలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. మెదక్ జిల్లా శివ్వంపేటలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
* నేడు ములుగు, భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క .. ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి సీతక్క.. అనంతరం భూపాలపల్లి జిల్లా లో పర్యటించనున్న మంత్రి సీతక్క. ఘనపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి .. అనంతరం ఘనపూర్ మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సీతక్క.
* ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా.. ఏజెన్సీని వణికిస్తున్న చలి . రాష్ర్టంలో నే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదు. కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 8.4 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.. ఆదిలాబాద్ జిల్లా బేల లో 8.9డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* అమరావతి: ఏపీ హైకోర్టులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్వాష్ పిటిషన్.. జనసేన నేత క్రాంతి కుమార్ ఫిర్యాదుపై టెక్కలి పోలీసులు తనపై నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని పిటిషన్.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద రైతాంగం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహా ధర్నా…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర మంత్రులు నారాయణ .. ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక.. కలెక్టరేట్ లో 0861-2331261 నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* తిరుపతి: లడ్డూ నెయ్యి కల్తీలో కీలకమైన ఆధారాలు సేకరించిన సీబీఐ సిట్ బృందం.. నేడు తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ సహా తిరుమలలో సిట్ పర్యటన…
* తూర్పుగోదావరి జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని రాజమండ్రిలో ఓఎన్జీసీ ర్యాలీ.. రాజమండ్రిలోని గెయిల్ ఆఫీస్ నుండి ఓ ఎన్ జి సి కార్యాలయం వరకు కొనసాగనున్న ర్యాలీ
* తిరుమల: 7 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,637 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,016 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.2 కోట్లు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కొత్తపేట(మ) వానపల్లిలో శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీమహాస్వామి పర్యటన.. పళ్లాలమ్మ ఆలయం , వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో స్వామీజీ ప్రత్యేక పూజలు
* అల్లూరి ఏజెన్సీలో తగ్గని పర్యాటకుల రద్దీ… పాడేరు వంజంగి కొండ పై సూర్యోదయం తిలకించేందుకు పర్యాటకుల ఆసక్తి… ఏజెన్సీ వ్యాప్తంగా వీస్తున్న చలి గాలులు… పాడేరు 13, మినుములురు వద్ద 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు..
* అమరావతి: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేసిన వర్మ.. ఆర్జీవీపై ప్రకాశం, విశాఖ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదు
* అమరావతి: ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు విచారణ..