హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది..…
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.
రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, కదిరి రూరల్, తనకల్లు మండలాల్లో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంచి చేశారు కాబట్టే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో వృధా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారని…
ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో మరింతగా పొలిటికల్ హీట్ పెరగనుంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరుగనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ…
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో జూలై నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లను టీటీడీ విడుదల చేయనుంది. 22వ తేది ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా…
గత శనివారం సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి గుర్తించారు పోలీసులు. దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఫుట్‌పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు తెలుసుకున్నారు. రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడిచేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. దాడి చేసిన సమయంలో సతీష్‌తో పాటు…
తెలుగు విలన్ రవికిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో విలన్ గా నటించాడు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించిన రవి కిషన్ రేసుగుర్రం చిత్రంలో శివారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారు… ఆ సినిమా క్రేజ్ తోనే మరిన్ని హిట్ సినిమాల్లో నటించారు. విలన్ గా మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ఈయన ప్రజల ఆదరణతో ముందుకు సాగుతున్నాడు.. ఇప్పుడు తాజాగా లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రవి కిషన్ ఒక వివాదంలో…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మా పలాస బహిరంగ సభ పెట్టారన్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. ఇవాళ ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారన్నారు. రాష్ర్టాన్ని పద్నాలుగెండ్లు ఎలా దోచుకున్నారో ప్రజలు చూశారని ఆయన విమర్శించారు. పెత్తందారులు రాష్ర్టాన్ని ఎలా సంకనాకించారో చుసామని, బాబు స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో పైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్ అన్నారు. రూల్స్ అతిక్రమించి ఒరల్ ఇనస్ట్రక్షన్ సిఎం ఇచ్చారని రాసిందెవరని ఆయన ప్రశ్నించారు. పివి…