గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఒకవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూనే.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. వార్ 2 మొదటి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల 10 రోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టారు.. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు..…
కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో, ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘ఎన్నికల మిత్ర’ (www.electionmitra.in)ని ప్రారంభించారు. ఆదివారం నాడు. ఈ సాధనం సహజమైన మానవ భాషా పరస్పర చర్య ద్వారా అవసరమైన ఎన్నికల-సంబంధిత సమాచారాన్ని త్వరగా మరియు ప్రామాణికంగా యాక్సెస్ చేయడంలో వివిధ వాటాదారులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల మిత్రా ఎన్నికల…
ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్కు ఒక DSP, ఇద్దరు Clలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్లు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇదిలా ఉంటే.. CM జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ…
రాళ్ళ దాడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ తిరుపతిలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు రాళ్ళతో కొట్టాలని పిలుపునిచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు వద్ద మంచి పేరు కోసం టిడిపి వారే శ్రీ వైఎస్ జగన్ పై రాళ్ళు విసిరారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే రాయి సీఎంకు తగిలి, పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కి తగిలిందని, అయన కూడా కంటికి చికిత్స తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ సింపతీ…
థియేటర్లలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో హారర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ మూవీ సైతాన్.. డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి టాక్ ను అందుకుంది.. సినిమా మొత్తం ఉత్కంఠభరితమైన సీన్స్…
ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే స్థానికంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన…
రాజస్థాన్‌లోని కోటాలో బాలుర హాస్టల్ భవనం ఆదర్శ్ రెసిడెన్సీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి జరగడంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి ‘మేమంత సిద్ధం’ యాత్రను పునఃప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. “సీఎం జగన్‌కు వైద్యులు ఈరోజు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు, అయితే ఆయన బస్సు యాత్రను కొనసాగించడానికి రేపటి నుండి తిరిగి అదే వేగంతో తిరిగి ప్రారంభిస్తారు. ప్రజలు ఆయన తిరిగి రావడానికి ఆసక్తిగా…
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు ఎంపీగా ఉంది ఇక్కడి ప్రజలకు బీబీ పాటిల్ సేవలు అందించారన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ స్వేచ్ఛ ఇవ్వకపోయినా పని చేసిన వ్యక్తి బీబీ పాటిల్ అని ఆయన అన్నారు. ఇప్పుడు బీజేపీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి…
వడ్డీ వ్యాపారం ముసుగులో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని మల్టీ జోన్ 1 ఐజీ రంగనాథ్ తెలిపారు. మల్టీ జోన్ 1 పరిధిలో గత కొద్ది కాలంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారస్తులు ప్రజలకు రుణాల ను అందిస్తూ వారి నుండి అధిక మొత్తంలో వడ్డీలను వసూళ్ల కు చేస్తూ, డబ్బు చెల్లించని వారిని బలవంతంగా ఇల్లు, పొలాలకు సంబందించిన పత్రాలను బలవంతంగా తీసుకుంటున్నట్లుగా మల్టీ జోన్ పరిధిలో పలు…