Peddireddy Ramachandra Reddy : చంద్రబాబు హయాంలో టీడీపీ వారికి మాత్రమే పథకాలు అందించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, కదిరి రూరల్, తనకల్లు మండలాల్లో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంచి చేశారు కాబట్టే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో వృధా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారని ఆయన ఆరోపించారు. త్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనాన్ని, విలువైన ఐదేళ్ల సమయాన్ని వృధా చేశారని ఆయన మండిడపడ్డారు.
Also Read
2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు టిడిపి వారికి మాత్రమే పథకాలు అందించారని, పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన ఘనత సిఎం వైఎస్ జగన్ సొంతమన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత సుపరిపాలన అందిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కే గ్యారెంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడు అని మండిపడ్డారు. భవిష్యత్తు లేని చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తారట.. తెలంగాణలో ఓటుకు నోట్లు స్కాంలో దొరికిపోయి.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను వదిలి రాత్రికి రాత్రే పారిపోయి ఆంధ్రకు వచ్చారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!