తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత ఆదివారం పరామర్శించనున్నారు . అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబాన్ని కలిసి స్వయంగా ఆమె భరోసా అందించనున్నారు .
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని చేపట్టిన ఆందోళనను గ్రామస్థులు తాత్కాలికంగా విరమించారు. ఈ నెల 4వ తేదీన కలెక్టర్ వచ్చి చర్చిస్తారనే హామీతో ప్రజలు ఆందోళనను విరమించారు.
బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని.. బీఆర్ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్ ( రిటైర్ మెంట్)ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని.. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయారని చెప్పారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని.. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. కేటీఆర్ తనకు ఇచ్చిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. లేకుంటే వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.