భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్‌లో అనుమతులు జారీ చేసే పోర్టల్‌లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా పలు రోజుల పాటు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రకటనలో తెలిపారు.
వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుండగానే జగన్, షర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్‌కు బెంగుళూరులో ఇల్లు ఉందని షర్మిలకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు ఇచ్చారని వెల్లడించారు. వివాహం అయినా తర్వాత షర్మిల వాటాలు తీసుకొని మళ్ళీ ఆస్తులు కోరడం సమంజసం కాదన్నారు.
నాలుగు గ్రీన్‌ఫీల్డ్ హైవేలకు 45,300 కోట్లు అవసరమని.. ఈ పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయన్నారు. 18వేల కోట్లతో పనులు ముందుగా పూర్తి చేస్తారని.. హైదరాబాదు నుంచీ మచిలీపట్నం కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించామని చెప్పారు.
* ఢిల్లీ: విభజన సమస్యలపై నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా * నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన * హైదరాబాద్: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. పలు కమిటీలతో విడి విడిగా భేటీ కానున్న బన్సల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు , అభ్యర్థుల పై చర్చ * ఆదిలాబాద్: నేడు జిల్లాకు బీఆర్ఎస్…
Minister Nara Lokesh: రాష్ట్రంలోని పాఠశాలల్లో కొత్తగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,762 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి పలు వినతిపత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని 32,818 పాఠశాలల్ల్లో తరగతి గదుల మరమ్మతులు, టాయ్ లెట్లు, తాగునీటి…
ఐఎండీ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయవ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి పారాదీప్ (ఒడిశా)కి 460 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 490 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 540 కిమీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు.
* రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. బ్రిక్స్ సమ్మి్ట్లో భాగంగా నేడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.. ఐదేళ్ల తర్వాత తొలిసారిగా బ్రిక్స్ సమ్మిట్లో జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని మోడీ. * నేడు వయనాడ్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న ప్రియాంకా గాంధీ.. హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రేవంత్రెడ్డి తదితర నేతలు.. * అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ..…