బీజేపీ నేతల మాటలకు మాజీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని బీజేపీ నేతలు అంటున్నారని.. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతురావు అన్నారు. రాహుల్ గాంధీ కులగణన చేసి దేశంలోని అన్ని కులాలకు న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రధాని మోడీ మాత్రం కులాల మధ్య రాహుల్ గాంధీ చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు.
కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని విజయం కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే విషయం తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని నారా బ్రాహ్మణి తాజాగా నెరవేర్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో చర్చించారు.
తెలంగాణలోని జూనియర్ జాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపటి(నవంబర్ 6) నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశాన్ని కల్పించింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 వరకు అవకాశాన్ని కల్పించారు
రైతును నిలబెట్టి, సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలా అయితే గేమ్ ఛేంజర్ అయ్యిందో.. రానున్న రోజుల్లో పకృతి వ్యవసాయం కూడా గేం ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( NIPER) త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కోరారు. నైపర్ సంస్థ గడచిన ఆరేళ్లుగా ఆగిపోయిందని.. దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే విషయంపై ఎంపీ చర్చించారు.
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ భేటీ అయింది. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణపై చర్చించారు.
ఏపీలో నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ, నిర్మూలన, అక్రమ మద్యం నివారణ, డ్రగ్స్, మద్యం బాధితుల పునరావాసంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోమ్, మానవ వనరుల, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, వైద్యారోగ్య శాఖ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు , క్రీడల నిర్వహణ, గ్రామ స్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటు పై చర్చించారు.