* గుజరాత్‌లో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. నేడు ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న మోడీ..
* నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి.. ఉదయం 9.30 గంటలకు నెక్లెస్ రోడ్‌లో ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించనున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, నేతలు
* తెలంగాణలో మయోనీస్ బ్యాన్.. నేటి నుండి ఒక సంవత్సరం వరకు మయోనీస్ బ్యాన్ చేసిన ప్రభుత్వం.. పచ్చి కోడి గుడ్డుతో తయారు చేస్తున్న మయోనీస్ పై నిషేధం విధించిన సర్కార్
* అమరావతి: నేడు ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేదీ పదవీ విరమణ.. ఇప్పటికే EWS సెక్రెటరీగా పోలా భాస్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాళెంలో క్యాంప్ కార్యాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేటలో ఉంటారు..
* ప్రకాశం : ఇవాళ్టి నుంచి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ.. తెల్ల రేషన్ కార్డు దారులకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందించనున్న ప్రభుత్వం.. జిల్లా వ్యాప్తంగా 6,82,437 మంది లబ్ధిదారులకు పథకం వర్తింపు.. బుక్ చేసిన 24 గంటల్లో గ్యాస్ సిలెండర్ అందేలా చర్యలు..
* ప్రకాశం : ఒంగోలులో దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమం.. 39 అడుగుల మూడు తలల నరకాసుర విగ్రహానికి సంహారం చేసిన సత్యభామ రూపిణీ.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా హాజరైన ప్రజలు..
* కడప : మూడవరోజు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటన… అనంతరం ఇడుపులపాయ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు వెళ్ళనున్న మాజీ సీఎం జగన్
* తిరుపతి: ఇవాళ్టి నుంచి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ.. తెల్ల రేషన్ కార్డు దారులకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందించనున్న ప్రభుత్వం.. జిల్లా వ్యాప్తంగా 5.80,237 మంది లబ్ధిదారులకు పథకం వర్తింపు..
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
* విశాఖ: స్టీల్ ప్లాంట్ కార్యాచరణపై వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ
* కర్నూలు: నేడు హోళగుంద లో వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం…
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 11,640 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 11,337 క్యూసెక్కులు.. 2 గేట్ల ఎత్తివేత