హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెయిన్ బజార్‌లోని ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచారు.
ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మాలపాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Road Accident: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పేట వద్ద నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముందున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కకు ఆపి పంచర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్యలో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో బయటికి తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ని అరగంట…
* మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నేటి పర్యటన వివరాలు.. ఉదయం 10 మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 5 గంటలకు తూర్పు నాయుడుపాలెం I.O.C దామచర్ల సత్య కార్యాలయంలో జరిగే కొండపి నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. * ప్రకాశం : గిద్దలూరులో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా.. * ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టు…
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని, నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని నేను ఆనాడే చెప్పా అని, ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని.. ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు…
భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్లో అనుమతులు జారీ చేసే పోర్టల్లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా పలు రోజుల పాటు ఆన్లైన్ అనుమతుల సేవలు నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రకటనలో తెలిపారు.
వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుండగానే జగన్, షర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్కు బెంగుళూరులో ఇల్లు ఉందని షర్మిలకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు ఇచ్చారని వెల్లడించారు. వివాహం అయినా తర్వాత షర్మిల వాటాలు తీసుకొని మళ్ళీ ఆస్తులు కోరడం సమంజసం కాదన్నారు.