Kurnool: కప్పట్రాళ్ల వద్ద తాత్కాలికంగా ఆందోళన విరమించిన గ్రామస్థులు
- కప్పట్రాళ్ల వద్ద తాత్కాలికం ఆందోళన నిలిపివేత
- ఈ నెల 4న కలెక్టర్ వచ్చి చర్చిస్తారనే హామీతో ఆందోళన విరమణ
- కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ఆందోళన చేపట్టిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని చేపట్టిన ఆందోళనను గ్రామస్థులు తాత్కాలికంగా విరమించారు. ఈ నెల 4వ తేదీన కలెక్టర్ వచ్చి చర్చిస్తారనే హామీతో ప్రజలు ఆందోళనను విరమించారు. కప్పట్రాళ్ల యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వేలాది మంది పత్తికొండ-కర్నూలు రహదారిపై బైఠాయించారు. మూడు గంటలపాటు ఆందోళన చేయడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది కప్పట్రాళ్ల, బేతపల్లి, పి.కోటకొండ, చెల్లెలచెలిమిల, నెల్లిబండ, గుండ్లకొండ తదితర గ్రామాల నుంచి తరలివచ్చారు.
Read Also: CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
కప్పట్రాళ్లు రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలపై కొన్ని గ్రామాల ప్రజలంతా కలిసి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఎదుర్కొనేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కప్పట్రాళ్ల రక్షిత అడవిలో కేంద్ర సర్కారు యురేనియం తవ్వకాలకు 68 బోర్లకు అనుమతులు ఇవ్వడంపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాలకు అనుమతిస్తే అన్ని విధాలుగా నష్టపోతామని ప్రజలు వాపోయారు. యురేనియం అనుమతులు రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్థానిక ప్రజలు హెచ్చరించారు.
ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ పరిధిలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో 468.25 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి. కౌలుట్లయ్య మలగా పిలిచే ఈ రిజర్వు ఫారెస్ట్ కప్పట్రాళ్ల, పి.కోటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమిల, గుండ్లకొండ గ్రామాల మధ్య విస్తరించింది. ఆ కొండపైనే కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశంలోనే సర్వే కోసం అనుమతులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రజలు ఆందోళనకు దిగారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!