Tirumala Laddu Ghee Adulteration Case: కల్తీ నెయ్యి వ్యవహారం కీలక పరిణామం.. ఏకసభ్య కమిటీ నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం ఏక సభ్య కమిటీని నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను విచారణ కమిషనర్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో వన్ మెన్ కమిటీ ఈ వ్యవహారంపై లోతైన అధ్యయనం చేపట్టనుంది. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలాగే జరిగిన లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయా..? నాణ్యత తనిఖీలలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా..? అనే అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఇక, ప్రభుత్వం కమిటీకి 45 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో ఈ వ్యవహారం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పారదర్శక విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని భక్తులు ఆశిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు కొనసాగుతోన్న తరుణంలో.. తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది..
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!