Peddapalli: పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
- పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు -రాకపోకలకు అంతరాయం..
- గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు..
- రాఘవపూర్- కన్నాల మధ్యలో పట్టాలు తప్పి 11 భోగీలు పట్టాలపై బోల్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని రాఘవపూర్, కన్నాల మధ్యలో రాగానే ఒక్కసారిగా 11 భోగీలు పట్టాలపై బోల్తా పడ్డాయి. స్థానికులు గుర్తించి రైల్వేశాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. పట్టాలపైనే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు ఆగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ప్రమాదానికి గురైన గూడ్స్ రైలు గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. మూడు ట్రాక్ లు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ క్రేన్ లతో పట్టాల పై పడ్డ బోగీలను అందులో ఉన్న మెటీరియల్ సిబ్బంది తొలగిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సుమారు 20 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. 18 రైళ్లు దారిమల్లించామని పాక్షికంగా 4 రైళ్ల రద్దు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!