ఏపీ రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ది, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రూపాయల మేర రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది.
Yadagirigutta: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భారీగా క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద చేస్తున్న పోస్టులను డీజీపీకి ఇచ్చామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోరామని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారని.. సుధారాణి అనే యువతిపై చిలకలూరిపేట సీఐ తీవ్రంగా దాడి చేసి కొట్టారని ఆయన పేర్కొన్నారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాలో హౌసింగ్‌పై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. పీఎంఈవై మొదటి దశలో లో కేటాయించిన 70శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని మంత్రి పార్థసారధి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని వెల్లడించారు.
గండికోట ప్రపంచంలో టాప్ 10 ప్రదేశాలలో ఒకటని.. 13వ శతాబ్దం లో నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గండికోటలో కోట సముదాయంలో రాజవంశాల వారసత్వాలు ఉన్నాయన్నారు. గండికోట లోఅడ్వంచెర్ గేమ్స్‌కి అవకాశాలు ఉన్నాయని.. గండికోట లో కూడా సీప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి.. ఇవాళే అక్కడ దిగాలనుకున్నామన్నారు. కేంద్రం సహకారంతో సీప్లేన్‌లు ఎక్కువ ప్రాంతాల్లో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు రైస్ మిల్లులలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లిలో అనేక మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష కూటమి ఉంటాయని.. మేం కాకుండా ప్రతిపక్షం లేనపుడు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని జగన్ కోరారు. ప్రతిపక్షాన్ని గుర్తిస్తే ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకుడు ఉంటారు కదా అంటూ వ్యాఖ్యానించారు.