DGCA New Rules: ఇకపై విమానంలో ‘వీరంగాలు’ చెల్లవ్.. బాసు కొత్త రూల్స్ తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGCA New Rules: విమానంలో ప్రయాణించేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా లేదంటే తోటి వారి భద్రతకు ముప్పు తెచ్చే ప్రవర్తనను “వికృత ప్రవర్తన” గా పరిగణిస్తూ DGCA ఆరు కొత్త రకాల తప్పులను రూల్స్ బుక్‌లోకి ఎక్కించింది. పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ జారీ చేసిన కొత్త ఉత్తర్వులో ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Jonathan Trott: “ప్లేయర్స్ బాగా ఎదిగారు”.. అఫ్గాన్ టీమ్‌తో విడిపోతూ కన్నీళ్లు పెట్టుకున్న కోచ్..
Also Read
ఆ ఆరు తప్పులు ఇవే..
* విమానంలో సిగరెట్ లేదా ఈ-సిగరెట్ తాగడం.
* అనుమతి లేని చోట లేదా పరిమితికి మించి మద్యం తాగడం.
* ఎమర్జెన్సీ డోర్స్‌ను అనవసరంగా తెరవడం లేదా లైఫ్ జాకెట్లను అనధికారికంగా వాడటం.
* విమానంలో నినాదాలు చేయడం లేదా ఆందోళనలు చేపట్టడం.
* మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టడం.
* గట్టిగా అరవడం, తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెట్టడం, ముందున్న సీట్లను లేదా టేబుళ్లను తన్నడం వంటి పనులు.
వీటికి శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?
ఎవరైనా ఇలాంటి పనులు చేస్తూ దొరికిపోతే, విమానయాన సంస్థలు వారిని 30 రోజుల పాటు విమానం ఎక్కకుండా నేరుగా నిషేధించవచ్చు. దీని కోసం ఎలాంటి కమిటీ విచారణ అవసరం లేదు. విమాన భద్రతకు హాని కలిగిస్తే అది నేరంగా పరిగణించి, నిందితులపై చట్టపరమైన శిక్షలు కూడా తీసుకోవచ్చు. ప్రయాణీకుడు సిబ్బంది మాట వినకుండా వికృతంగా ప్రవర్తిస్తుంటే, పైలట్ వెంటనే ఆ విషయాన్ని సంబంధిత విభాగానికి తెలియజేస్తారు. విమానాన్ని దారి మళ్లించి, దగ్గరలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారు. విమానం ల్యాండ్ అవ్వగానే అక్కడి భద్రతా సిబ్బంది ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని తగిన చర్యలు చేపడతారు. నిజానికి విమాన ప్రయాణం అనేది అందరి భద్రతతో కూడుకున్నది. ఒక్క ప్రయాణీకుడి తప్పు వల్ల విమానంలోని వందలాది మంది ప్రాణాలకు ముప్పు కలగవచ్చు, అందుకే DGCA ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: The Hundred 2026: పాకిస్థాన్ ప్లేయర్లను బహిష్కరించిన ఆ 4 మేజర్ టీమ్స్!
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!