Jonathan Trott: “ప్లేయర్స్ బాగా ఎదిగారు”.. అఫ్గాన్ టీమ్‌తో విడిపోతూ కన్నీళ్లు పెట్టుకున్న కోచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jonathan Trott: అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. టీమ్‌తో తనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెట్‌తో నాలుగేళ్ల అనుబంధానికి కోచ్ జోనాథన్ ట్రాట్ ముగింపు పలకనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్గాన్ టీమ్‌కు కోచ్‌గా ఉండే అవకాశం తన జీవితంలో అత్యంత విలువైనదని చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. మొదట ఈ బాధ్యత గ్రాహమ్ థోర్ప్‌కు తీసుకోవాల్సి ఉండేది. కానీ.. కొన్ని కారణాల వల్ల బాధ్యతలు స్వీకరించలేపోయారు. అప్పుడు ట్రాట్‌కు ఈ అవకాశం వచ్చింది. తనకు ఈ అవకాశం అనుకోకుండా వచ్చినదేనని.. కానీ దాన్ని నా సవాలుగా తీసుకుని తన వంతు కృషి చేశానని జోనాథన్ ట్రాట్ అన్నారు. ఆటగాళ్లపై తనకు ఉన్న ప్రేమను గుర్తు చేసుకున్నారు. ప్లేయర్స్ ఎదుగుదలే తనకు పెద్ద సంతృప్తి అని చెప్పారు.
READ MORE: Tamil Nadu: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్ పార్టీలోకి ఓపీఎస్.!
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఈ టీమ్‌తో గడిపిన రోజులు కేవలం మ్యాచ్‌లకే పరిమితం కాలేదని జోనాథన్ ట్రాట్ భావోద్వేగంగా వివరించారు. మైదానంలో రాణించడం ఒక భాగమే.. కానీ సాధారణ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన యువకులు తమ కుటుంబాల భవిష్యత్తును మార్చుకునే స్థాయికి ఎదగడం తనకు నిజమైన గెలుపు అనిపించిందని చెప్పారు. తాను బాధ్యత తీసుకున్నప్పుడు బాలుడిగా ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో యువకులుగా ఎదగడం తన కెరీర్‌లో మరిచిపోలేని అనుభవమని అన్నారు. ఇదిలా ఉండగా.. ట్రాట్ కోచ్‌గా ఉన్న సమయంలో అఫ్గానిస్థాన్ వైట్‌బాల్ క్రికెట్‌లో కొత్త శక్తిగా ఎదిగింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు దగ్గరగా చేర..… 2024 టీ20 వరల్డ్‌కప్‌లో నాకౌట్ దశలోకి ప్రవేశించడంలో ఆయన పాత్ర మరవలేనిది. తాజాగా కెనడాపై 82 పరుగుల విజయంతో టోర్నీని ముగించిన అనంతరం.. కోచ్ తన చివరి రోజు సందర్భంగా మాట్లాడిన మాటలు అందరినీ కలచివేశాయి.
READ MORE: Rashmika Mandanna: కాక్‌టెయిల్ 2 నుంచి క్రేజీ న్యూస్.. కృతితో నేషనల్ క్రష్ లవ్!
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..