ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రసంగం చాలా భావోద్వేగంగా సాగింది. ముందుగా కర్ణాటకలో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసినందుకు నిర్మాత వెంకట్‌కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా ఈరోజు పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా ఈ చల్లని సాయంత్రం ఆయన ఓ వర్షపు చినుకుల రూపంలో, చల్లని గాలి రూపంలో ఆయన మన పక్కనే ఉన్నారని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. పునీత్ రాజ్‌కుమార్ లేరని తానెప్పుడూ ఏడవలేదని.. ఏడవను కూడా అని…
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత డైరెక్టర్ శంకర్‌తో రామ్‌చరణ్ ఓ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా అతడికి సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన ఈ బాహుబలి కాజాను చెర్రీకి బహూకరించింది. కాగా రాజమండ్రి వచ్చే…
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘వలిమై’. గతంలో ఈ ఇద్దరితో హిందీ ‘పింక్’ను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేసిన బోనీ కపూర్ ఇప్పుడీ సినిమా నిర్మించారు. తెలుగువాడైన కార్తికేయ విలన్ గా నటించడంతో మనవారికీ ఈ మూవీ మీద కాస్తంత ఆసక్తి పెరిగింది. అయితే… అజిత్, హెచ్. వినోద్, బోనీకపూర్ కాంబోలో వచ్చిన ఈ సెకండ్ మూవీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విశాఖ…
హైదరాబాద్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొగులయ్యను వేదికపై చిత్ర యూనిట్ సన్మానించింది. భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొగులయ్య మాట్లాడుతూ.. భీమ్లానాయక్ సినిమాలో తాను పాట పాడటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పాట పాడకపోతే తానెవరో ఎవరికీ తెలిసేది…
ప్రముఖ నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో శిరీషా శ్రీధర్ ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 18న సినిమా జనం ముందుకొస్తున్న నేపథ్యంలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘యువత కోణంలో సాగే చిత్రమిది. వాళ్ల ఆలోచనలకు ప్రతిబింబంలా ఉంటుంది. 16 ఏళ్లకు అమ్మాయి, అబ్బాయి కొత్తగా రెక్కలొచ్చినట్లు ఫీలవుతారు. యువత లైఫ్…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అంతకంటే ముందు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు రెండు విడుదల తేదీలు ప్రకటిస్తూ సరికొత్త ట్రెండ్‌ను రాజమౌళి సృష్టించాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాను పలు సినిమాలు ఫాలో అవుతున్నాయి. వారం రోజుల కిందట ఆర్.ఆర్.ఆర్ మూవీకి రెండు విడుదల తేదీలను…
‘రాజావారు రాణి గారు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం గత ఏడాది ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’తో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. దాంతో నాలుగైదు సినిమాలలో అతనికి హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం నటించిన మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’ విడుదల తేదీని నిర్మాతలు ప్రమోద్, రాజు మంగళవారం ప్రకటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ…
శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. దీనికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతోంది. దాంతో 4వ తేదీ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. ఫిబ్రవరి 4న టైటిల్ సాంగ్ (ఆడవాళ్లు మీకు…
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్…
తెలుగు సినిమా రంగంలో ఎందరో సంగీత దర్శకులున్నా, సినీజనం మాత్రం దేవిశ్రీ ప్రసాద్, థమన్ వెంటే పరుగులు తీస్తున్నారు. దాంతో ఒక్కో సినిమాకు వారు రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. టాప్ స్టార్స్ లో అధిక శాతం వీరిద్దరి వెంటే పడుతూ ఉండడంతో, వైవిధ్యం కూడా కొరవడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైవిధ్యం కోసం ఎ.ఆర్.రహమాన్ వైపు మన తెలుగువారి చూపు సాగుతోందని వినికిడి. నిజానికి ఎ.ఆర్.రహమాన్ తొలి రోజుల్లో…