బాలీవుడ్ పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి సహజంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిందంటే… యోగాకు సంబంధించినవో, హెల్దీ ఫుడ్ కు సంబంధించినవో అనుకుంటాం. అయితే తాజాగా అందుకు భిన్నమైన వీడియోను శిల్పాశెట్టి పోస్ట్ చేసింది. తన పెరటిలోని చెట్టు కాయాలను ఎగిరెగిరి కోసిన వీడియోను పెట్టింది శిల్పాశెట్టి. అంతేకాదు… ఆ వీడియోతో పాటు ఆసక్తికరమైన విషయాలూ పొందుపర్చింది. మన చేతులతో నాటిన మొక్క… చెట్టుగా ఎదగడం, కాయలు కాయడం… వాటిని కోసుకునే ఛాన్స్ మనకు దక్కడం నిజంగా ఆనందకరమైన విషయమే కదా! అది శిల్పాశెట్టి విషయంలోనూ జరిగిందట.
తమ ఇంటి పెరట్లో ఆమె నాటిన స్టార్ ప్రూట్ మొక్క చెట్టుగా ఎదిగి బోలెడు కాయలు కాయడం మొదలు పెట్టిందట. దాంతో ఆమె వాటిని ఎగిరెగిరి, ఆపైన స్టూల్ ఎక్కి కోస్తూ వీడియో తీసింది. బేసికల్ గా హెల్త్ టిప్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించే శిల్పాశెట్టి… ఈ స్టార్ ఫ్రూట్స్ గొప్పతనం కూడా తెలిపింది. వీటిని తింటే సి విటమిన్ పెరుగుతుందని, అలానే దానికి కాస్తంత పింక్ సాల్ట్ ను జత చేస్తే రుచి అమోఘంగా ఉంటుందని చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే, శిల్పాశెట్టి ప్రస్తుతం ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ టీవీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. అలానే ‘నికమ్మా’ అనే సినిమాలో నటిస్తోంది.