రెడీ అవుతున్న ’30 వెడ్స్ 21′ సీజన్ 2!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాయ్ బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ’30 వెడ్స్ 21′. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ లాక్డౌన్‌లో అందరినీ అలరించింది. చైతన్య, అనన్య జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. అసమర్థుడు, మనోజ్ పీ సంయుక్తంగా రెండో సీజన్ కాన్సెప్ట్‌ను రాయగా.. పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. రెండో సీజన్ త్వరలోనే యూ ట్యూబ్ లో టెలీకాస్ట్ కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేసింది. చైతన్య, అనన్య ఇద్దరూ కూడా ఈ పోస్టర్‌లో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌తోనే రెండో సీజన్ మీద పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. అలానే ఈ వెబ్ సీరిస్ కు సంబంధించిన టీజర్ ను జనవరి 31న విడుదల చేయబోతున్నారు. జోస్ జిమ్మి సంగీతాన్ని అందించగా, ప్రత్యక్ష్ రాజు కెమెరామెన్‌గా, తారక్ సాయి ప్రతీక్ ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహేందర్, దివ్య, వీరభద్రం, శ్రీ కుమారి ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..