కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 ఎంఓయూలు కుదిరాయి. కుప్పం పరిధిలో వ్యర్ధాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్-ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందంజరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో 10వేల…
కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీ - నీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణా జిల్లాలు కుప్పంలో అడుగుపెట్టాయి. పరమ సముద్రం అనే గ్రామం వద్ద నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పంకు వెళ్లి పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు హారతులు పట్టి స్వాగతం పలకనున్నారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు…
పీ4పై అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పీ4 లోగోను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు.. #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆవిష్కరించారు. అయితే, ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు..
Woman Constable Attempts Suicide in Kuppam: ప్రేమించిన తనను కాదని మరో యువతిని ప్రియుడు పెళ్లి చేసుకోవడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. సదరు మహిళా కానిస్టేబుల్ సగం కాలిన దేహంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మహిళా కానిస్టేబుల్ కుటంబ సభ్యులు నిరసనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల…
మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు.
సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారు.. 22ఏ కిందా ప్రజల భూములను పెట్టి వైసీపీ నేతలు వేధించారు.. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు అని…
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది.. బాధితురాలికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు, బాధితురాలి పిల్లలు చదువుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.. రూ.5లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.. అయితే, ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్.. నేను మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతాను అని ప్రకటించారు.
కుప్పంలో జరిగిన ఓ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది.. అయితే, నేరుగా బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. టీడీపీ స్థానిక లీడర్‌కు ఫోన్ చేసిన ఆయన.. బాధితురాలి దగ్గరకు వెళ్లిన తర్వాత.. ఆమెతో మాట్లాడారు.. ఎట్టిపరిస్థితిలోనూ నిందితులకు వదిలిపెట్టనని.. తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. బాధితురాలి పిల్లల చదువుకి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు చంద్రబాబు.