KA Paul: చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది.. బాధితురాలికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు, బాధితురాలి పిల్లలు చదువుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.. రూ.5లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.. అయితే, ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్.. నేను మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతాను అని ప్రకటించారు.. సీఎం చంద్రబాబుకి ఒక ముఖ్య మైన లెటర్ రాశాను అన్నారు.. సీఎం చంద్రబాబు అసెంబ్లీ లో ఏడవడం చూసాం.. బయట కూడా చూసాం.. కూటమి ప్రభుత్వం వచ్చింది ఏడాది అయ్యింది.. ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అమలు పర్చారు..? అని నిలదీశారు..
Read Also: Chhattisgarh: దారుణం.. ముగ్గురు గ్రామస్థులను గొంతు కోసి చంపిన నక్సల్స్..
వైఎస్ జగన్ 5 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వీళ్లు ఇంకో 5 లక్షల కోట్లు చేశారు.. కానీ, వీళ్లు సూపర్ సిక్స్ అమలు పరిచామని చెప్పుకుంటున్నారు.. ఇవన్నీ పవన్ కి తెలియ దు.. ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చారు.. చేసుకుంటు వెళ్తున్నాడు అని వ్యాఖ్యానించారు పాల్.. ప్రత్యేక హోదా వల్ల ఏడాదికి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి.. 10 లక్షల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది.. రేతులకు, నిరుద్యోగులు కు మహిళలకు, చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది.. మరీ ముఖ్యగా సూపర్ సిక్స్ అమలు పర్చాలంటే ఏడాదికి ఒక లక్ష 50 వేల కోట్లు కేంద్ర ఇస్తేనే అన్నారు.. నేను రాసిన లెటర్ కి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇవ్వలేదు అన్నారు… ప్రజలు జగన్ కి ప్రతి పక్ష హోదా ఇవ్వలేదు.. ప్రతి పక్ష నేనే కాబట్టి.. ప్రజల తరపున గొంతుగా ప్రశ్నిస్తానని వ్యాఖ్యానించారు.
Read Also: CM Chandrababu: కుప్పం బాధితురాలికి చంద్రబాబు ఫోన్.. ఆర్థికసాయం ప్రకటన.. నిందితులకు వార్నింగ్..
అయితే, ఒక అంశం లో సీఎం చంద్రబాబు ని అభినందిస్తున్నాను.. ఒక మహిళలను కట్టేసి దారుణంగా కొట్టారు.. తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారని పేర్కొన్నారు కేఏ పాల్.. కానీ, ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి.. ఇటువంటి వి మరో సారి జరగకుండా ఉండాలంటే అసెంబ్లీ లో బిల్ పెట్టాలి.. నేను మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతానని ప్రకటించారు. అప్పులు ఇచ్చి రౌడీ ఇజానికి పాల్పడుతున్నారో అటువంటి వారిపై స్టాలిన్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది.. అసెంబ్లీలో బిల్ పెడుతున్నారు.. అప్పులు ఇచ్చి మహిళలు కొట్టి వారి ఆడపిల్లలు ఎత్తుకెళ్లి అప్పులు వసూలు చేసుకుంటున్నారు.. అసలు ఇది ఎంత దారుణం…? అని ఆవేదన వ్యక్తం చేశారు.. అలా వసులు చేసే వారికి కఠిన చర్య లు తీసుకోవాలి.. 5 లక్షల జరిమానా.. 5 ఎళ్ల జైలు శిక్ష విధించాలి.. అటువంటి బిల్ అసెంబ్లీలో పెట్టాలని సీఎం చంద్రబాబుని కోరారు.. నేను రాసిన లెటర్ కి 7 రోజులు లోపు నాకు రిప్లై ఇవ్వాలి.. ప్రత్యేక హోదాపై హై కోర్ట్ లో కౌంటర్ ఫైల్ చెయ్యాలి… మనకు ప్రత్యేక హోదా కావాలి… మన బ్రతుకులు మారాలని వ్యాఖ్యానించారు కేఏ పాల్..