టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు.. 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కొల్పొకుండా ఉండేందుకు గ్రామస్థాయి…
ఏపీ రాజకీయాల్లో కుప్పంపై మరోసారి రచ్చేనా? కుప్పం మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తోంది ఎవరు? ఇప్పుడు మిస్ అయితే అంతే సంగతులు అని ఎవరు భయపడుతున్నారు? కుప్పం కోటలో వైసీపీ, టీడీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్..! కుప్పం మున్సిపాలిటీలో పెరిగిన రాజకీయ కదలికలు..! టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం రాజకీయంగా మళ్లీ వేడెక్కింది. రాష్ట్రంలో పెండింగ్‌లో పడిన మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టడంతో కుప్పంలో పొలిటికల్ కదలికలు…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు కాస్త 15 సీట్లుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని కామెంట్ చేశారు జనసేన నేతలు.. చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.. సమావేశానికి ముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన జన సైనికులు ఆ తర్వాత సమావేశమయ్యారు.. ఆ మీటింగ్‌కు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, జనసేన కుప్పం ఇంచార్జి డాక్టర్ వెంకటరమణ తదితరులు హాజరు కాగా.. ఈ…
టీడీపీ అధినేత చంద్రబాబు చూడని రాజకీయం.. చూడని ఎత్తుపల్లాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. అలాంటి చంద్రబాబు తన రాజకీయం జీవితంలో ఎన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీసం సొంత నియోజకవర్గంలోనూ పార్టీని గాడినపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తుంది.…
2019 ఎన్నికల్లో ప్రారంభమైన వైసీపీ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అయితే టీడీపీ పరిస్థితి మాత్రం 2019 కంటే ఇంకా దయనీయంగా మారినట్లు కన్పిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట సైతం ఇప్పుడు ఆపార్టీ సత్తా చాటలేకపోవడం ఇందుకు నిదర్శంగా నిలుస్తుంది. టీడీపీకి కంచుకోటలుగా ఏరియాలు సైతం ఈ ఎన్నికల్లో బీటలువారినట్లు కన్పిస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ…
కుప్పంలో వైసీపీ నేతలు ఏం చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమేనట. ఒక పథకంతో రెండు ప్రయోజనాలను పొందే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. దానిపైనే ఇప్పుడు రెండు పార్టీల్లోనూ చర్చ. అదేంటో ఇప్పుడు చూద్దాం. కుప్పంలో నాడు-నేడు పథకానికి ప్రాధాన్యం టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం. వరసగా ఏడుసార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. కిందటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది కుప్పమే. ఆ ఎన్నికల్లోనే వైసీపీ పూర్తిగా ఇక్కడ ఫోకస్…
కుప్పంలో టెన్షన్ వాతారవరణం నెలకొంది. కుప్పంలో ఇవాళ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ర్యాలీకి పిలుపునిచారు బలిజ సామాజిక వర్గం నేతలు. కానీ ఆ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని బలిజ సామాజిక వర్గ పెద్దలు ప్రకటించారు. దాంతో గత రాత్రి నుంచి ముఖ్య నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఉంచిన శ్రీ మంజునాథ రెసిడెన్సి వద్ద 50 మందికి పైగా పోలీసులను మోహరించారు.…
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌పై చర్చ ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో రచ్చ అవుతూనే ఉంది. కుప్పం వేదికగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామాలు చంద్రబాబుకు చికాకు తెచ్చిపెట్టాయని.. ఏం జరిగిందో అని ఆయన ఆరా తీశారని తెలియడంతో పార్టీలోనూ అటెన్షన్‌కు కారణమైంది. కుప్పంలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల సందడి టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రచ్చ రచ్చ అవుతోంది. అధినేత చంద్రబాబుకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదని చెబుతున్నారు. కుప్పం…
జూనియర్ ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఎన్టీఆర్… రాజకీయాల్లోకి ఆరగేట్రం చేస్తారని టిడిపి నేతలు, ఇటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్… పొలిటికల్ ఎంట్రీపై ఏ రోజు సరిగా స్పందించిన దకళాలు లేవు. కానీ ఏపీలో అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పోస్టర్లు, బ్యానర్లు వెలుగుచూశాయి. 2024 లోపైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఆసక్తితో ఉన్నారు. అయితే తాజాగా.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన…