AP News: కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం సీఎం సమక్షంలో 6 ఎంఓయూలు!
- కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం 6 ఎంఓయూలు
- సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు
- సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్-ఐటీసీతో ఒప్పందం
- ఫైబర్ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఎంఓయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 ఎంఓయూలు కుదిరాయి. కుప్పం పరిధిలో వ్యర్ధాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్-ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందంజరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో 10వేల మంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయటంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ చేసుకుంది.
కుప్పంలో ఫైబర్ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్ వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఎంఓయూ కుదిరింది. రూ.1,100 కోట్ల పెట్టుబడితో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డును కింగ్స్ వుడ్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో 2012 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కుప్పంలో 2 సీటర్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ ఒప్పందం చేసింది. రూ.150 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 70 నుంచి 100 శిక్షణకు ఉపయోగించే 2 సీటర్ విమానాలను తయారు చేయనుంది. మొత్తం 250 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Kieron Pollard: కీరన్ పొలార్డ్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా రికార్డు!
బెంగుళురుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఎత్రెయాల్ ఎక్ప్ ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదిరింది. మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ రేజర్ క్రెస్ట్ ఎంకె-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎత్రెయాల్ ఒప్పందం చేసుకుంది. రూ.500 కోట్ల పెట్టుబడిని మూడు దశల్లో పెట్టేలా కార్యాచరణ, మొత్తం 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ తో ఎంఓయూ కుదిరింది. రూ.300 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉపాధి కల్పించేలా ప్రతిపాదన సమర్పించింది. మామిడి, జామ, టమాటో పల్పింగ్ యూనిట్లను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..