సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీలో మహిళల భద్రతపై ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు…
కుప్పం ఘటన చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు మహిళలపై.. చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేయడం.. చెట్టుకు కట్టేసి కోట్టడం జరుగుతున్నాయి.. ఇన్ని దారుణాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అయినా జరిగాయా...? అని ప్రశ్నించారు.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజు…
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని సీఎం ఎస్పీ తెలిపారు.…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి, దాడి చేసిన అమానవీయ ఘటన కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో వెలుగు చూసింది. నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం భరించలేక ఊరు విడిచి పెట్టి వెళ్లిపోగా.. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ..…
CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు (ఆదివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం పది గంటలకు శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురంలో నిర్మించిన ఆయన కొత్త ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇప్పటికే కుప్పానికి చేరుకున్నారు. ఈ గృహప్రవేశాన్ని పురస్కరించుకుని సీఎం ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అతిధులకు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.. నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది.. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగ అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు.. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.. ఇక, కుప్పం పర్యటన ముగించుకొని సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు...
ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ తాజాగా మరోసారి చర్చనీయాంశం అయింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో మొదలైన సెగల సైడ్ ఎఫెక్ట్స్ గురించే తాజా చర్చ. కుప్పం అంటే చంద్రబాబు... బాబు అంటే కుప్పం అన్నంతగా ఈ నియోజకవర్గంతో ఆయనకు బంధం పెనవేసుకుపోయింది. వరుసగా 8 విడతల నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారాయన.
చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ కార్యాలయంలో 'జన నాయకుడు' వెబ్సైట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్నీ ప్రత్యేక జీవో ద్వారా ఎత్తేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం జిల్లాలో పర్యటిస్తున్నారు.. రెండో రోజు బిజీబిజీగా గడపనున్నారు సీఎం చంద్రబాబు.. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు..