CM Chandrababu: సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా..!
- సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ..
- తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
- కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శంకుస్థాపన..
- కుప్పంకు ఎయిర్ పోర్ట్ వస్తుంది.. స్వర్ణ కుప్పమే నా టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారు.. 22ఏ కిందా ప్రజల భూములను పెట్టి వైసీపీ నేతలు వేధించారు.. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు అని ఆరోపించారు.. అయితే, రాష్ట్రం మొత్తం సర్వే చేయిస్తున్నాం.. ప్రజలకు భూమికి రక్షణగా అన్ని చర్యలు తీసుకుంటాను అన్నారు.. కుప్పం హార్టికల్చర్ హాబ్ అవుతుందన్నారు.. గత ఐదేళ్లుగా నకిలీ మద్యం తాగి ఇష్టానుసారం ప్రవర్తించారు… రోడ్డుమీదకు వచ్చి మహిళలపై దాడులు చేశారు… నన్నే కుప్పానికి రానుకుండా చేశారు.. సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ హెచ్చరించారు..
Read Also: Japan Airlines: 36వేల నుంచి 10వేల అడుగుల ఎత్తుకు పడిపోయిన విమానం.. చివరికీ…(వీడియో)
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
రాజకీయ నేరస్తుల మయం అయిపోయింది.. బాబాయ్‌ని చంపి.. బాబాయ్ కూతురుతో అన్న మంచోడని చెప్పించారు… నేను హత్య, శవ రాజకీయాలు చేయాను అన్నారు చంద్రబాబు.. ప్రజాహితం రాజకీయాలే నాకు తెలుసు.. ధర్మాని కాపాడుతాను.. అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తాను.. కానీ, అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుకోవాలని చూస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, వాట్స్ అప్ గవర్నెన్స్ తో సులువుగా సేవలు పొందవచ్చు… వెయ్యి కోట్లతో పలమనేరు… కృష్ణగిరి నాలుగు లైన్లు రోడ్డు అభివృద్ధి చేస్తాం.. కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు… అభివృద్ధి కావాలి… సంక్షేమం జరగాలన్నారు.. ఇంటింటికి చేసినా అభివృద్ధి చెప్పడానుకి సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం అభివృద్ధే నా లక్ష్యం అభివృద్ధి చేసి చూపిస్తా.. స్వర్ణ కుప్పం లక్ష్యంగా పెట్టుకున్నా.. చేసి తీరుతాం.. ఈ ఏడాదే కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వస్తాయన్నారు.. కుప్పం ప్రజలు మట్టిలో నడవకుండా రోడ్లు వేస్తాం అన్నారు.. గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. మేం అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నాం.. కుప్పంకు ఎయిర్‌పోర్ట్ కూడా వస్తుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!