CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఓ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది.. అయితే, నేరుగా బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. టీడీపీ స్థానిక లీడర్‌కు ఫోన్ చేసిన ఆయన.. బాధితురాలి దగ్గరకు వెళ్లిన తర్వాత.. ఆమెతో మాట్లాడారు.. ఎట్టిపరిస్థితిలోనూ నిందితులకు వదిలిపెట్టనని.. తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. బాధితురాలి పిల్లల చదువుకి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు చంద్రబాబు.. మరో మారు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం అన్నారు.. దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ ఎంతటి వారైనా వదలను అని హెచ్చరించారు చంద్రబాబు.. మరోసారి డబ్బుల కోసం ఎవరు మహిళ జోలికి రాకూడదు… వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నారు..
Read Also: Heart Rate: భయం, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు హార్ట్ బీట్ అస్మాత్తుగా ఎందుకు పెరుగుతుంది?
మానవత్వం లేకుండా ఒక దుర్మార్గుడు ప్రవర్తించినట్టు ప్రవర్తించారు.. వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. పెద్ద పాపను స్కూల్‌లో చేర్పించాలని, మరో ఇద్దరు పిల్లల్ని చదివించాలని సీఎం చంద్రబాబును కోరారు బాధిత మహిళ.. వెంటనే పెద్ద అమ్మాయిని హాస్టల్ చేర్పిస్తామని, ఇద్దరు పిల్లల చదువుతో పాటు, ఐదు లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు సీఎం.. ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటూ బాధిత మహిళలకు ధైర్యం చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..